16 ఏళ్ల వయసులో అమ్మ ముందే కమిట్‌మెంట్ అడిగారు.. వరుణ్ సందేశ్ భార్య షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
16 ఏళ్ల వయసులో అమ్మ ముందే కమిట్‌మెంట్ అడిగారు.. వరుణ్ సందేశ్ భార్య షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరోయిన్ వితికా శేరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘చక్రవాకం’ సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ‘ప్రేమించు రోజుల్లో, సందడి, ఝుమ్మందినాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరి’ వంటి సినిమాల్లో నటించింది. నటన పరంగా పర్వాలేదు అనిపించుకున్న ఈ అమ్మడు.. అనుకున్నంత పాపులారిటీని మాత్రం సొంతం చేసుకులేకపోయింది. ఇక హీరో వరుణ్ సందేశ్‌తో ప్రేమ, పెళ్లి అనంతరం పూర్తిగా సినిమాలకు దూరం అయింది.

ఇక ఇటీవల వరుణ్, వితికా ఇద్దరు జంటగా బిగ్‌బాస్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈ అమ్మడు.. పలు ఫొటో షూట్‌లతో, వీడియోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితికా తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నట్లు చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ‘మేము చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడేవాళ్లం. మా అమ్మే నన్ను, నా చెల్లిని పెంచింది. అదే సమయంలో మా ఇంటి అవసరాల కోసం ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ప్రతి ఆడీషన్‌కు మా అమ్మను తోడు తీసుకుని వెళ్లేదాన్ని. ఈ క్రమంలోనే నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు నాకు ఓ ఆఫర్ వచ్చింది. దాని కోసం నన్ను ఎంపిక చేశారు. అయితే.. మా అమ్మతో మాట్లాడాలి అని నన్ను బయటకు పంపించారు. మీ అమ్మాయికి సినిమాలో చాన్స్ కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్‌మెంట్ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుందని అన్నారు. ఆ మాట మా అమ్మకు అర్థం కాక.. నన్ను లోపలికి పిలిచి కమిట్‌మెంట్ అంటున్నారు ఏంటీ అని అడిగింది. నేను వెంటనే ఆ ఆఫర్‌కు నో చెప్పి అక్కడ నుంచి వచ్చేశాము’ అంటూ చెప్పుకొచ్చింది. వితికా మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed