ప్రకాశం జిల్లా వరప్రదాయనిపై పవన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
ప్రకాశం జిల్లా వరప్రదాయనిపై పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వారాహి విజయభేరిలో ఆయన ప్రసంగించారు. కూటమి అధికారంలోకి వస్తే వెలిగొండను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానన్న సీఎం జగన్ ఖాళీ సొరంగాలు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందలం ఎక్కితే ప్రజల భవిష్యత్తును చంపేశారు. కూటమి ప్రభుత్వంలో తొలి సంతకం మెగా డీఎస్సీపైనేనని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలపించాలని, ప్రజల కష్టంలో తాను కూడా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed