- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajnath Singh: 'సబ్కా బాస్' అనుకునేవాళ్లకు భారత ఎదుగుదల నచ్చడం లేదు: రాజ్‌నాథ్ సింగ్
'అందరికీ బాస్ మేమే', భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది?' భావిస్తున్నారని రాజ్‌నాథ్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియాను టార్గెట్ చేస్తూ భారీగా సుంకాలు విధించడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 'సబ్కా బాస్' అని భావించే అమెరికాకు ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుదల నచ్చడం లేదని అన్నారు. మనదేశం సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధి పట్ల సంతోషంగా లేనివారు ఉన్నారు. వారికి అది ఇష్టం లేదు. 'అందరికీ బాస్ మేమే', భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది?' భావిస్తున్నారని రాజ్‌నాథ్ తెలిపారు. తమకంటే ధీటుగా ఎదగకూడదనే ఉద్దేశంతో భారత్ అభివృద్ధిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే భారత వస్తువులపై అధిక పన్నులు విధిస్తున్నారని, తద్వారా ఇతర దేశాలలో తయారైన వాటి కంటే ఖరీదైనవిగా మారాలని చూస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశాభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఏ శక్తీ ఇప్పుడు భారత్‌ను ప్రధాన ప్రపంచ శక్తిగా మారకుండా ఆపలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైల్, మెట్రో కోచ్ తయారీ యూనిట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్యాక్టరీలో మెట్రో, వందే భారత్ రైళ్ల కోచ్‌లను తయారు చేయనున్నారు. రూ. 1,800 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 2026 నాటికి మొదటి దశ పూర్తవుతుందని తెలుస్తోంది.
త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుంది. ఇలాంటి సమయంలో మన సొంత ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. దీనికోసం ప్రధాని మోడీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్-ఇన్-ఇండియా ద్వారా అనేక రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల మధ్య రక్షణ ఎగుమతులు ప్రభావితం కాలేదని, అవి నిరంతరం పెరుగుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.






