- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతి ఎన్నికలపై శబరిమల అంశం ప్రభావం చూపదు: సీఎం పినరయి విజయన్
కేరళలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రెండో, తుది విడత పోలింగ్ (Final phase of polling) ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: కేరళలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రెండో, తుది విడత పోలింగ్ (Final phase of polling) ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలైన త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోళికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్లలోని 604 స్థానిక సంస్థల పరిధిలో ఉన్న 12,391 వార్డులకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్ కన్నూర్ లోని తన సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక రాజకీయ ప్రకటనలు చేశారు. ప్రజలు తమ కూటమి అయిన ఎల్‌డీఎఫ్ (LDF)కు మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. "యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF)కు బలమైన స్థావరాలుగా పరిగణించబడే ప్రాంతాలు సైతం ఇప్పుడు ఎల్‌డీఎఫ్‌ను ఆమోదిస్తున్నాయి" అని ఆయన అన్నారు.
అలాగే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన శబరిమల అంశం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని సీఎం విజయన్ (CM Vijayan) పేర్కొన్నారు. "శబరిమల విషయంలో ప్రభుత్వం చాలా ఖచ్చితమైన చర్యలు తీసుకుందని, దీనికి భక్తుల నుంచి తమకే పూర్తి మద్దతు ఉందని, ఈ విషయంలో బీజేపీ, యూడీఎఫ్‌లు ఒకే బాటలో ప్రయాణిస్తున్నాయి," అని సీఎం పినరయి విజయర్ విమర్శించారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ, ముస్లిం వర్గాలు జమాత్-ఎ-ఇస్లామీని తిరస్కరించాయని, అలాగే ప్రభుత్వం , దేశం బాధితులకు అండగా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
Read More..






