కేరళలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం

by Malleboina Mahesh |

కేరళలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రెండో, తుది విడత పోలింగ్ ప్రారంభమైంది.

కేరళలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రెండో, తుది విడత పోలింగ్ (Final phase of polling) ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలైన త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోళికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్లలోని 604 స్థానిక సంస్థల పరిధిలో ఉన్న 12,391 వార్డులకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1.53 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 38,994 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రెండో విడత పోలింగ్ కోసం 18,274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు, వెబ్‌కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీని కూడా ఏర్పాటు చేశారు. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 9న ఏడు దక్షిణ, మధ్య జిల్లాల్లో విజయవంతంగా ముగియగా, ఈ తుది విడత పోలింగ్‌తో మొత్తం 1,199 స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ రెండు విడతల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 13న జరగనుంది, దీని ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Next Story