- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైనికుల్ని భయపెడుతున్న వాటర్ బాటిల్స్.. మంచినీళ్లు తాగి నలుగురు మృతి
ఉక్రెయిన్ పై కొంతకాలంగా యుద్ధం చేస్తోన్న రష్యన్ సైనికులు ఇప్పుడు మంచినీళ్లు తాగాలంటేనే జంకుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్ పై కొంతకాలంగా యుద్ధం చేస్తోన్న రష్యన్ సైనికులు ఇప్పుడు మంచినీళ్లు తాగాలంటేనే జంకుతున్నారు. వార్ లో ఫ్రంట్ లైన్లో ఉన్న నలుగురు సైనికులు మంచినీళ్లు తాగిన కొద్దిసేపటికే కుప్పకూలారు. ప్రాణాలు కోల్పోవడంతో.. అంతా మంచినీళ్ల వల్లేనని నిర్థారించారు. అవే నీళ్లు తాగిన మరికొందరు సైనికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచినీళ్లలో విపం కలపడమే ఇందుకు కారణమని సమాచారం. రష్యా ఆక్యుపైడ్ దౌనెట్స్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అవర్ వాటర్ అనే లేబుల్ తో ఉన్న వాటర్ బాటిల్స్.. మానవతా సహాయం కింద ఆ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఫ్రంట్ లైన్ జవాన్ల చేతికి ఆ వాటర్ ఎలా వచ్చాయి ? దీని వెనుక ఉన్నదెవరు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుండగా.. వాటిని ఉక్రెయిన్ వర్గాలు ఖండిస్తున్నాయి. సైనికులు డ్రగ్స్ వాడారన్న విషయాన్ని దాచి ఉంచేందుకే ఈ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది.






