Russia: కుర్స్క్‌లో రష్యా బలగాల పట్టు.. ఉక్రెయిన్ నుంచి రెండు గ్రామాలు స్వాధీనం

by B.Srinivas |   (  Updated:2025-03-15 15:04:34  IST  )

ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చల కోసం ఓ వైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు రష్యా దాడులతో విరుచుకుపడుతోంది.

Russia: కుర్స్క్‌లో రష్యా బలగాల పట్టు.. ఉక్రెయిన్ నుంచి రెండు గ్రామాలు స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ రష్యా (Ukrein Russia) మధ్య శాంతి చర్చల కోసం ఓ వైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు రష్యా దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే కుర్స్క్ (Kursk) సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ దళాల నుంచి మరో రెండు గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా శనివారం వెల్లడించింది. ఇటీవల తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సుడ్డా (Suzda) పట్టణానికి ఉత్తరం, పశ్చిమాన ఉన్న జావోలోషెంకా (Zaoleshenka) , రుబాన్షినా (Rubanshchina) గ్రామాలను ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ప్రాంతంలో రష్యా బలగాలు పట్టు సాధించాయని పేర్కొంది. అయితే దీనిపై ఉక్రెయిన్ స్పందించలేదు.

ఈ ప్రాంతంలో పోరాడుతున్న ఉక్రేనియన్ దళాలు ఆయుధాలు విడిచిపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత గ్రామాల స్వాధీనంపై ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం భారీ వైమానిక దాడులు ప్రారంభించినట్టు పలు కథనాలు వెల్లడించాయి. రెండు దేశాలు ఒకరిపై ఒకరు డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఉక్రెయిన్ యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణపై చర్చించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తో సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.

Read Also.. Starmer: పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలి.. గ్లోబర్ లీడర్స్‌కు బ్రిటన్ పీఎం స్టార్మర్ విజ్ఞప్తి

Next Story