- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. కీలక ప్రాంతాలే టార్గెట్
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. శాంతి చర్చలంటూ కథనాలు వెలువడుతున్న వేళ రష్యా మరోసారి విరుచుకుపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. శాంతి చర్చలంటూ కథనాలు వెలువడుతున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 479 డ్రోన్లు, 20 మిస్సైల్స్‌తో దాడి చేసింది. మధ్య, పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం సోమవారం వెల్లడించింది. మూడేళ్ల యుద్ధంలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదేనని తెలిపింది. దీనికి ఉక్రెయిన్ సైతం దీటుగా బదులిచ్చింది. రష్యా ప్రయోగించిన వాటిలో 277 డ్రోన్లు, 19 క్షిపణులను ధ్వంసం చేసింది. కేవలం 10 డ్రోన్లు, మిస్సైల్స్ మాత్రమే వాటి లక్ష్యాలను చేధించాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్ సైతం తమపై డ్రోన్ దాడి చేసిందని రష్యా తెలిపింది. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 49 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేసినట్టు పేర్కొంది. రెండు డ్రోన్లు చువాషియాలోని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలను తయారు చేసే ప్లాంట్‌ను ఢీకొట్టగా స్వల్ప నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. వోర్ నెజ్ ప్రాంతంలో చేసిన దాడిలో గ్యాస్ పైప్‌లైన్ దెబ్బతినగా స్వల్ప మంటలు చెలరేగాయని తెలిపింది. కాగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి12,000 మందికి పైగా ఉక్రేనియన్ పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రష్యా తరచుగా సైనికేతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపించింది.






