2026 కల్లా మిగతా ఎస్-400 వ్యవస్థల డెలివరీ.. హామీ ఇచ్చిన రష్యా!

by Phanindra |   (  Updated:2025-06-02 15:06:19  IST  )

2026 కల్లా మిగతా ఎస్-400 వ్యవస్థల డెలివరీ ఇస్తామని రష్యా హామీ ఇచ్చింది. భారత్, పాక్ ఉద్రిక్తతల సమయంలో ఎస్-400 కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

2026 కల్లా మిగతా ఎస్-400 వ్యవస్థల డెలివరీ.. హామీ ఇచ్చిన రష్యా!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు అందించాల్సిన మిగతా ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను వచ్చే ఏడాది కల్లా అందజేస్తామని రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఇన్ ఇండియా రోమన్ బాబుష్కిన్ వెల్లడించారు. రష్యా నుంచి భారత్ ఐదు ఎస్-400 వ్యవస్థలను ఆర్డర్ చేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం మూడు ఎస్-400 సిస్టమ్స్ మాత్రమే భారత్‌కు అందాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మిగతా ఎస్-400 సిస్టమ్స్ డెలివరీ ఆలస్యమైంది. ఇలాంటి సమయంలో భారత్, పాక్ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ సమయంలో పాక్ దాడులను నిలువరించడంలో ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థ చాలా కీలకపాత్ర పోషించింది.

ఈ క్రమంలో మిగిలిన రెండు ఎస్-400 వ్యవస్థలను కూడా త్వరగా డెలివరీ ఇవ్వాలని భారత్ కోరింది. దీని కోసం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ స్వయంగా మాస్కో వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ ఆయన అనారోగ్యం కారణంగా ఈ పర్యటన రద్దయింది. ఈ క్రమంలోనే బాబుష్కిన్ ఈ అంశంపై స్పందించారు. ‘భారత్, పాక్ ఉద్రిక్తతల సమయంలో ఎస్-400 వ్యవస్థలకు అద్భుతంగా పనిచేశాయని మేం విన్నాం. రష్యా-భారత్ సహకారానికి చాలా చరిత్ర ఉంది. ఈ వ్యవస్థల డెలివరీ మాక్కూడా చాలా కీలకం. కానీ ప్రస్తుతం యూరప్‌లో మేం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భారత్, రష్యా రక్షణ భాగస్వామ్యంలో ఎస్-400 ఒప్పందం చాలా కీలకం’ అని బాబుష్కిన్ తెలిపారు.

Next Story