- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై దాడి చేస్తే ఊరుకోం: అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్‌పై దాడి చేస్తే ఊరుకోమని అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది....

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్‌లో 20 లక్షల మంది సోవియట్ యూనియన్ ప్రజలు నివసిస్తున్నారని, కానీ ఇరాన్ సహాయం అడగలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం’ (SPIEF) ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చర్చల ద్వారా పరిష్కరించుకోమని అమెరికా మాదిరిగానే తామూ సలహా ఇచ్చామని తెలిపారు. ఇజ్రాయెల్‌లో రష్యన్ జనాభా ఉందని చెప్పిన ఆయన అరబ్, ఇస్లామిక్ దేశాలతో తాము స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నామన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసినా ఇజ్రాయెల్‌లో రష్యన్ల కోసం తటస్థంగా ఉంటున్నామని చెప్పారు.
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదాన్ని వెంటనే ముగించాలని యూఏఈఎం సమయంలోనే కోరామని పుతిన్ గుర్తు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యవర్తిగా తాము సాయం చేస్తామని చెప్పారు పూర్వ సోవియట్ యూనియన్, రష్యన్ ఫెడరేషన్ నుంచి దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారనే వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తుమన్నారు. ఇజ్రాయెల్ దాదాపు రష్యన్ మాట్లాడే దేశమన్నారు. మిత్రదేశాల పట్ల విధేయతను చూపట్లేదనే విమర్శ రష్యాపై ఉందని, కానీ దానిని తాము దానిని తోసిపుచ్చుతున్నామన్నారు. అరబ్, ఇస్లామిక్ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. రష్యా జనాభాలో ముస్లింలు 15% ఉన్నారని, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)లో తాము పరిశీలకులిగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు.






