- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌పై పూర్తిగా నిషేధం విధించిన రష్యా.. ఆల్టర్‌నేట్ యాప్‌పై కీలక ప్రకటన
వాట్సాప్ రష్యా ఊహించని షాకిచ్చింది. స్థానిక చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు వాట్సాప్‌ను తమ దేశంలో పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ రష్యా ఊహించని షాకిచ్చింది. స్థానిక చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు వాట్సాప్‌ను తమ దేశంలో పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. రష్యా పెట్టిన నిబంధనలను పాటించడానికి వాట్సప్ నిరాకరిస్తోందని, ముఖ్యంగా నేరాలను అరికట్టడానికి అవసరమైన సమాచారాన్ని భద్రతా సంస్థలతో పంచుకోవడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు వాట్సాప్‌కు బదులుగా రష్యా ప్రభుత్వం ‘మ్యాక్స్’ (Max) అనే స్వదేశీ సూపర్ యాప్‌ను ప్రోత్సహిస్తోంది. ఇది చైనాలోని ‘వీచాట్’ మాదిరిగా మెసేజింగ్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను ఒకేచోట అందిస్తుంది.
వాట్సాప్ రియాక్షన్ ఇదే..
అయితే, తాజాగా రష్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాట్సాప్ తీవ్రంగా ఖండించింది. సుమారు 10 కోట్ల మంది వినియోగదారులను సురక్షితమైన కమ్యూనికేషన్‌కు దూరం చేసి, వారిని ప్రభుత్వ నిఘా ఉండే యాప్ (Max) వైపు మళ్లించే ప్రయత్నమిదని ఆరోపించింది. ఇక వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్ (Telegram) సేవలను కూడా రష్యా పరిమితం చేసింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై రష్యాలో ఆంక్షలు ఉన్నాయి. మరోవైపు తన పౌరుల డిజిటల్ కమ్యూనికేషన్‌పై పూర్తి నియంత్రణ సాధించాలనే ఉద్దేశంతో వాట్సాప్‌ను నిలిపివేసి, ప్రభుత్వ యాప్‌ను తప్పనిసరి చేస్తోందని ప్రపంచ వ్యాప్తంగా వాదనలను కూడా వినిపిస్తున్నాయి.






