RSS Chief Mohan Bhagwat : ‘పాకిస్తాన్ తప్పు చేసింది.. శిక్ష అనుభవించాల్సిందే.'

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-26 14:47:33  IST  )

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) స్పందించారు.

RSS Chief Mohan Bhagwat : ‘పాకిస్తాన్ తప్పు చేసింది.. శిక్ష అనుభవించాల్సిందే.
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్కకావిష్కరణ సభలో భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదని.. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని అన్నారు. కానీ వాళ్లు ఉగ్రవాదులతో చేయిస్తున్నారు.. అమాయకులను బలి తీసుకొని.. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని భగవద్గీత చెబుతోందని మోహన్ భగవత్ గుర్తుచేశారు. ప్రస్తుతం పాకిస్తాన్(Pakistan) తప్పు చేసింది.. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ నాడు రాముడు(Ramudu) కూడా.. రావణాసురుడ్ని రాజ్య ప్రజల సంక్షేమం కోసమే చంపారు. అది హింస కాదని అన్నారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే తప్పని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడం రాజు బాధ్యత.. ఇప్పుడు కూడా రాజు తన పని తాను చేసుకుంటూ పోతాడు అంటూ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తుచేస్తోందని అన్నారు. టూర్‌కు వచ్చిన అమాయకులను మతం అడిగి మరీ చంపడం దారుణమని పేర్కొన్నారు. ఆ దాడి దేశ ప్రజల్ని ఎంతో వేధనకు గురిచేసింది.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది అని మోహన్ భగవత్ ప్రకటించారు. మనకు బలం లేకపోతే వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లం.. కానీ ఇప్పుడు మనం బలవంతులం తప్పకుండా మన బలమేంటో శత్రువులకు చూపించాలని అని అభిప్రాయపడ్డారు.

Next Story