- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RSS Chief Mohan Bhagwat : ప్రధాని మోడీని కలిసిన RSS చీఫ్
జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం భారత్-పాక్ (Bharat - Pak) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు రెండు దేశాల సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ సీడీఎస్, రక్షణమంత్రి, ఎన్ఎస్ఏ లతో కీలక సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని, కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తామని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, ముష్కరులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురి చర్చించుకున్నారు. కాగా ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ మోడీకి హామీ ఇచ్చినట్టు సమాచారం.






