- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RSS: కొంత మందికి మన సొంత భాషలే తెలియవు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఇంగ్లీష్ భాష విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ భాషలు, మాతృభాషల వాడకం తగ్గడంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది భారతీయులకు మన స్వంత భాషలే (Indian languages) తెలియదు అనే పరిస్థితులు వచ్చాయన్నారు. ఆదివారం నాగ్ పూర్ లో జరిగిన ఓ బుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. భాషా వారసత్వం క్షీణిస్తుండటం పట్ల సమాజాం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. గతంలో మన సంభాషణలు, రోజువారీ వ్యవహారాలన్నీ సంస్కృతంలోనే ఉండేవి. కానీ ఇప్పుడు కొంత మంది అమెరికన్ ప్రొఫెసర్లు మనకు సంస్కృతం నేర్పుతున్నారని అన్నారు. వాస్తవానికి సంస్కృతం ప్రపంచానికి మనం నేర్పించాల్సిందన్నారు. నేటి తరం పిల్లలకు కొన్ని ప్రాథమిక, సరళమైన పదాలు కూడా తెలియవన్నారు.
ఇంగ్లీష్ మీడియం విద్య తప్పేమి కాదనని, కానీ ఇంట్లో భారతీయ భాషలు మాట్లాడటానికి ఇష్టపడకోపవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోందన్నారు. మన ఇంట్లో మన భాష మాట్లాడటం లేదన్నారు. ప్రస్తుతం సాధువులు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమస్య ఎక్కడొచ్చిందంటే మన భాషలలో వ్యక్తీకరించబడిన ఆలోచనలు, భావనల సారాంశం వాటి లోతులను వివరించే పదాలు ఆంగ్ల భాషలో తగినంతగా లేవన్నారు. భారతీయ సంప్రదాయంలోని పురాణాల నుంచి కోరికలను తీర్చే వృక్షాన్ని ఆంగ్లంలోకి ఎలా అనువదిస్తారని ప్రశ్నించారు. సాంస్కృతికంగా గొప్ప భావనలను విదేశీ భాషలోకి అనువదించడంలో ఉన్న పరిమితులను నొక్కి చెప్పారు. భారతీయ భాషలను ఎందుకు సంరక్షించాలనే దానికి ఇటువంటి పదాలు ఉదాహరణగా నిలుస్తాయన్నారు. భారతీయ సంప్రదాయం ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలకు మించి ఆలోచించడం, కుటుంబంతో పాటు సమాజ సంక్షేమం గురించి నేర్పుతుందన్నారు.






