కడలూరు రైలు ప్రమాదం మృతులకు రూ.5 లక్షలు పరిహారం

by Yella Dhawani Reddy |

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

కడలూరు రైలు ప్రమాదం మృతులకు రూ.5 లక్షలు పరిహారం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ వ్యాను సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి తగిన వైద్యం, అవసరమైన ఆర్థిక సాయం అందజేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అలాగే, ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తక్షణ నివేదిక సమర్పించాలని రైల్వే శాఖను కోరారు.

Next Story