RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-06-02 09:49:39  IST  )

రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.

RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను ఉపసంహరించుకుని దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇంకా ఆ నోట్లు పూర్తి స్థాయిలో తమకు చేరలేదని ఆర్బీఐ సోమవారం వెల్లడించింది. ఇంకా పెద్ద ఎత్తున చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ. 6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు పేర్కొంది. రూ.2000 నోట్లను అధికారికంగా ఆర్బీఐ 19 మే 2023న చలామణి నుండి ఉపసంహరించుకుంది. 19 మే 2023 నాటికి 98.26 శాతం రూ. 2 వేల నోట్లు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ఇప్పటికీ ప్రజల వద్ద ఈ నోట్లు ఉండటంతో వాటిని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.

Next Story