Cocain Smuggling : రూ.11 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. ఎక్కడ దాచాడంటే?

by Muthe.Rajitha |

ముంబై ఎయిర్పోర్టు(Mumbai Airport)లో నేడు భారీగా కొకైన్(Cocain Smuggling) లభ్యం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు.

Cocain Smuggling : రూ.11 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. ఎక్కడ దాచాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ముంబై ఎయిర్పోర్టు(Mumbai Airport)లో నేడు భారీగా కొకైన్(Cocain Smuggling) లభ్యం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. దాదాపు రూ.11 విలువైన కొకైన్ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని ఆ స్మగ్లర్ ఎక్కడ దాచి పెట్టుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అదేదో సినిమాలో డ్రగ్స్ స్మగ్లర్స్ మాదకద్రవ్యాలను కడుపులో దాచుకొని దేశాలు దాటించిన సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఐవరీ కోస్ట్ కు చెందిన ఓ వ్యక్తి సియోర్రా లియోన్ నుంచి ముంబై చేరుకున్న ఓ ప్రయాణికుడి తీరు అనుమానస్పదంగా ఉండటంతో అతన్ని క్షుణ్ణంగా పరిశీలించి విచారించగా.. తాను క్యాప్సూల్స్ రూపంలో కొకైన్ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు.

అతన్ని ఆసుపత్రికి తరలించి కడుపులో ఉన్న డ్రగ్స్ ను బయటికి తీయగా.. ఏకంగా 67 కొకైన్ క్యాప్సూల్స్ లభించాయి. వీటి విలువ రూ.11 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం నార్కోటిక్ పోలీసులు నిదితుణ్ణి అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు.

Next Story