- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : కోట్లు పెట్టి కారు కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తన కారు నెంబరుకు కూడా కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం వైరల్ అవుతోంది. హరియాణాలో ఫ్యాన్సీ వాహన నంబర్ ‘HR88B8888’ ఆన్‌లైన్ వేలంలో ఏకంగా రూ.1.17 కోట్లు పలికింది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్‌గా రికార్డు క్రియేట్ చేసినట్టు సమాచారం. హరియాణా రవాణాశాఖ వారానికోసారి నిర్వహించే వేలంలో 45 మంది దరఖాస్తు చేసుకోగా.. రూ.50 వేల ప్రారంభ ధరతో బిడ్డింగ్ ప్రారంభం అయింది.
ఆ వేలం కాస్త పోటా పోటీగా రూ.1.17 కోట్లకు చేరింది. గత వారం ఇదే ఆఫీసులో ‘HR22W2222’ నంబర్ రూ.37.91 లక్షలకు అమ్ముడై, వార్తల్లోకి ఎక్కగా.. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు దాటడం గమనార్హం. అయితే రూ.1.17 కోట్లతో నంబర్‌ను ఎవరు కొనుగోలు చేశారన్నది ఇంకా వెల్లడి కాలేదు.
Next Story






