RRB : పరీక్ష రాయాలంటే మంగళసూత్రం, జంధ్యం తీయండి : అధికారుల వింత నిబంధనలు

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా రైల్వేశాఖ(RRB) నిర్వహిస్తోన్న నర్సింగ్ సూపరిండెంట్ ప్రవేశ పరీక్ష సోమవారం ఉదయం నుంచి ప్రారంభం అయింది.

RRB : పరీక్ష రాయాలంటే మంగళసూత్రం, జంధ్యం తీయండి : అధికారుల వింత నిబంధనలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా రైల్వేశాఖ(RRB) నిర్వహిస్తోన్న నర్సింగ్ సూపరిండెంట్ ప్రవేశ పరీక్ష సోమవారం ఉదయం నుంచి ప్రారంభం అయింది. అయితే పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులకు అధికారులు వింత నిబంధనలు విధించారు. వివాహిత మహిళలు మంగళసూత్రం తీసివేసి పరీక్షకు హాజరవ్వాలనడంతో విస్తు పోవడం వారి వంతైంది. ఇక పురుషులకు జంధ్యం తొలగించి పరీక్ష హాలులోకి ప్రవేశించాలని సూచించడంతో అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే హాల్ టికెట్స్ లో సూచించిన విధంగానే మంగళసూత్రం, చెవిపోగులు, ముక్కుపుడకలు, జంధ్యం లేకుండా వస్తేనే పరీక్షకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేయడంతో కాసేపు పరీక్ష కేంద్రాల వద్ద పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

దీంతో పలు పరీక్షా కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మరీ ఇలాంటి కఠిన నిబంధనలు విధించడం ఏమిటని రైల్వే పరీక్షల బోర్డుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికైనా ఈ నిబంధనలు తొలగించాలని అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు.

Next Story