RPF Sub Inspector: రైల్వే అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డులు విడుదల..!

by Maddikunta Saikiran |
RPF Sub Inspector: రైల్వే అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డులు విడుదల..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 452 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) సబ్ ఇన్‌స్పెక్టర్(SI) ఉద్యోగాలకు గత మేలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డుల(Admit Cards)ను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ లో రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), యూజర్ పాస్ వర్డ్(User password)/ డేట్ ఆఫ్ బర్త్(Date Of Birth) వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed