- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో రోడ్డు ప్రమాదం : సంతాపం తెలిపిన సీఎం స్టాలిన్
తమిళనాడులోని కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలోని ఏల్తూరు గ్రామం వద్ద తిరుచ్చి–చెన్నై జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలోని ఏల్తూరు గ్రామం వద్ద తిరుచ్చి–చెన్నై జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచ్చి నుంచి చెన్నై వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సు ముందు టైర్ పేలడంతో అదుపు తప్పి మీడియన్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఒక ఎస్‌యూవీ, ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 7 మంది సహా మొత్తం 9 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. ఇద్దరు పిల్లలు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తలా రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడినవారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






