- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RN Ravi: దళితులపై పెరుగుతున్న దాడులు.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి
తమిళనాడులో అక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో అక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (Rn Ravi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు కేరళతో పోలిస్తే తమిళనాడులోనే ఎక్కువ అని చెప్పారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. దళిత సమాజానికి చెందిన వ్యక్తులపై వారి కుల గుర్తింపు కారణంగా దాడులు జరుగుతున్నాయని, వారిని చంపేస్తున్నారని తరచుగా వస్తున్న నివేదికలను చదవడం తనకు బాధ కలిగించిందన్నారు. దళితులను కొంతమంది అంటరాని వారిగా భావిస్తారని, ఇది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సామాజికంగా వారి పట్ల మనం వివక్ష చూపలేమన్నారు.
అక్షరాస్యత పరంగా బలమైన రికార్డున్న తమిళనాడు సామాజిక వివక్షతో పోరాడుతూనే ఉందని నొక్కి చెప్పారు. సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఎలా అభివృద్ధి చెందాయనే దానిలోనే తేడా ఉందన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా సమాజాన్ని విభజిస్తున్నాయని ఆరోపించారు. సామాజిక వివక్షను పాటించబోమని పొలిటికల్ పార్టీలు తమ కార్యకర్తలతో ఎందుకు ప్రమాణం చేయించకూడదని ప్రశ్నించారు.






