- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rn Ravi: జై శ్రీరాం అని నినదించండి.. స్కూల్ పిల్లలను కోరిన తమిళనాడు గవర్నర్ రవి
తమిళనాడు గవర్నర్ రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన రవి విద్యార్థులను జై శ్రీరామ్ అని నినదించాలని కోరారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Rn ravi) మరో వివాదంలో చిక్కుకున్నారు. మధురైలోని ఒక ప్రయివేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన రవి విద్యార్థులను జై శ్రీరామ్ (Jai Sriram) అని నినదించాలని కోరారు. తన ప్రసంగం చివరలో గట్టిగా జైశ్రీరామ్ స్లోగన్స్ ఇవ్వాలని చెప్పారు. స్పీచ్ అనంతరం ఆయన ఈ నినాదాలు చేయడంతో విద్యార్థులు సైతం పునరావృతం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కాంగ్రెస్ (Congress), డీఎంకే (Dmk), సహా పలు ఎన్జీవోలు రవిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘ఆర్ఎన్ రవి తన పదవి పరిమితులను ఉల్లంఘించారు. రాజ్యాంగాన్ని పాటించడం, దాని ఆదర్శాలను గౌరవించడంలో విఫలమయ్యారు. ఆర్టికల్ 159ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. కాబట్టి వెంటనే గవర్నర్ పదవి నుంచి సస్పెండ్ చేయాలి’ అని స్టేట్ ప్లాట్‌ఫామ్ ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ అనే సంస్థ డిమాండ్ చేసింది.
గవర్నర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rss), బీజేపీ భాషలో రవి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జెఎంహెచ్ హసన్ మౌలానా విమర్శించారు. అలాగే డీఎంకే అధికార ప్రతినిధి ధరణీ ధరణ్ స్పందిస్తూ ‘ఆర్ఎన్ రవి వ్యాఖ్యలు దేశ లౌకిక విలువలకు విరుద్ధం. ఆయన పదే పదే రాజ్యాంగాన్ని ఎందుకు ఉల్లంఘించాలనుకుంటున్నారు. దేశ సమాఖ్య సూత్రాలను ఆయన ఎలా ఉల్లంఘించారో ఇటీవలే స్పష్టమైంది. సుప్రీంకోర్టు ఆయనను ఎలా మందలించిందో అందరికి తెలుసు. ఇప్పటికైనా ఈ తరహా వ్యాఖ్యలు మానుకోవాలి’ అని ఫైర్ అయ్యారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను నిలిపివేస్తే గవర్నర్ ఆర్ఎన్ రవి తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తెలిపింది. ఈ క్రమంలోనే ఆయన మరోసారి వివాదాస్పదం కావడం గమనార్హం.






