బీహార్‌లో ఘోర పరాజయం.. ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

by Ajay Maddhiboyina |

బీహార్‌లో ఘోర పరాజయంపై ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ స్పందించింది. ట్విట్టర్ వేధికగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పేరుతో పార్టీ సోషల్ మీడియా అధికారిక పేజీ ఓ ట్వీట్ చేసింది.

బీహార్‌లో ఘోర పరాజయం.. ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో ఘోర పరాజయంపై ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ స్పందించింది. ట్విట్టర్ వేధికగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పేరుతో పార్టీ సోషల్ మీడియా అధికారిక పేజీ ఓ ట్వీట్ చేసింది. అందులో.. ప్రజాసేవ అనేది అంతంలేని ప్రయాణం అని పేర్కొంది. ఆటుపోట్లు ఎత్తుపల్లాలు సహజం అని తెలిపింది. విజయం దక్కిందని అహంకారం, ఓటమి పాలయ్యామని కుంగిపోమని పేర్కొంది.

రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ అని అధికారంలో ఉన్నా లేపోయినా పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాగా ప్రతిపక్షంలోని మహాఘట్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 25 సీట్లు మాత్రమే గెలిచింది. మరోవైపు మహాకూటమిలో ఎన్నోఅంచనాలతో బరిలోకి దిగిన వీఐపీ పార్టీ 0 స్థానాలకు పరిమితం అయ్యింది. మొత్తంగా మహాఘట్ బంధన్ కూటమి 34 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.

Next Story