- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RJD: ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర.. ఆర్జేడీ సంచలన ఆరోపణ
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ధన్‌ఖడ్‌ను తప్పించడం బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించింది. బిహార్‌లో సొంత సీఎం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా నితీశ్ కుమార్‌ను ఎన్నికలకు ముందే సాగనంపేందుకు కుట్ర పన్నిందని ఆర్జేడీ చీఫ్ విప్ అఖ్తరుల్ ఇస్లాం షాహిన్ అన్నారు. మంగళవారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ‘నితీశ్‌ను సీఎం పదవి నుంచి తొలగించి సొంత ముఖ్యమంత్రిని నియమించాలని బీజేపీ చాలా కాలంగా కోరుకుంటోంది. కానీ ఇక్కడ ఎన్డీఏ ఓటమి ఖాయమైంది. అందుకే బీజేపీ నిరాశ చెందుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ నితీశ్‌ను తప్పించడానికి ధన్ ఖడ్ తో రాజీనామా చేయించారు’ అని అన్నారు.
నితీశ్‌ను ఉప ప్రధానమంత్రిగా చేయాలని మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా సూచించారు, ఇప్పుడు ధన్‌ఖఢ్ రిజైన్ చేశారు. కాబట్టి నితీశ్‌ను రాజకీయంగా వెనక్కి నెట్టడానికి బీజేపీ ప్రణాళికలు వేసిందన్నారు. ఆర్జేడీ వ్యాఖ్యలను జేడీయూ నేత శ్రావణ్ కుమార్ తోసిపుచ్చారు. నితీశ్ కుమార్ బిహార్‌ను విడిచి వెళ్ళే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు నాయకత్వం వహిస్తారని, తప్పకుండా విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. నితీశ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని తెలిపారు.






