అర్ధరాత్రి ఢిల్లీలో అలజడి.. నటి హ్యుమా ఖురేషీ బంధువు దారుణ హత్య

by Kema Shiva Kumar |

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి అలజడి చోటుచేసుకుంది.

అర్ధరాత్రి ఢిల్లీలో అలజడి.. నటి హ్యుమా ఖురేషీ బంధువు దారుణ హత్య
X

దిశ, వెబ‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి అలజడి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్‌పురా భోగల్ లేన్‌లో రాత్రి 11 గంటల సమయంలో ఓ ఇంటి గేటు సమీపంలో టూ వీలర్ పార్కింగ్ చేశారు. ఈ విషయంలో నటి హ్యుమా ఖురేషీ బంధువు అయిన అసిఫ్ ఖురేషీతో కొంతమంది వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరగడంతో అసిఫ్‌పై గొడవపడిన వ్యక్తులు పదునైన ఆయుధంతో అతడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే అసిఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడికి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అసిఫ్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు నిజాముద్దీన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story