Retreat: అట్టారి వాఘా బార్డర్‌లో రిట్రీట్ వేడుకలు.. 12 రోజుల తర్వాత ప్రారంభం

by B.Srinivas |

పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దులో 12 రోజుల తర్వాత రిట్రీట్ వేడుకలు నిర్వహించారు.

Retreat: అట్టారి వాఘా బార్డర్‌లో రిట్రీట్ వేడుకలు.. 12 రోజుల తర్వాత ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని అట్టారి-వాఘా (Attari vagha) సరిహద్దులో 12 రోజుల తర్వాత రిట్రీట్ వేడుకలు (Retreat ceremony) నిర్వహించారు. సుమారు గంటపాటు ఈ సెలబ్రేషన్స్ చేపట్టగా బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) మహిళా సైనికుల బృందం విన్యాసాలు చేపట్టింది. ఈ టైంలో భారత్ పాక్ దేశాల సైనికులు కరచాలనం చేసుకోలేదు. జెండా అవతనం చేసే సమయంలో సరిహద్దులను తెరవలేదు. అటారీ వాఘా బార్డర్‌తో పాటు అమృత్‌సర్‌లోని అట్టారి, ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేనివాలా, ఫాజిల్కాలోని సద్కిలలో బీటింగ్ రిట్రీట్ వేడుక తిరిగి ప్రారంభమైంది. అయితే ఈ వేడుకల్లో కేవలం మీడియా సిబ్బందికి, పరిమిత సంఖ్యలో పర్యాటకులకు అనుమతిచ్చారు. మే 21 నుంచి ప్రజలు హాజరు కావడానికి అనుమతి ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది.

కాగా, 1959 నుంచి ఇరు దేశాల మధ్య రిట్రీట్ వేడుక సంప్రదాయంగా జరుగుతోంది. ఏప్రిల్ 22న పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ వేడుకను నిలిపివేశారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మరోసారి ప్రారంభించారు. ఈ వేడుక పునఃప్రారంభం ఈ సమాజాలను పునరుజ్జీవింపజేసి, సాధారణ స్థితిని తిరిగి నెలకొల్పుతుందని భావిస్తున్నారు.

Next Story