- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు విడుదల
by Ajay Maddhiboyina |
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐదు అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా చెరో స్థానం బీజేపీ, ఆప్ కైవసం చేసుకున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐదు అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా చెరో స్థానం బీజేపీ, ఆప్ కైవసం చేసుకున్నాయి. కాడిలో బీజేపీ అభ్యర్థి రాజేంద్రకుమార్ గెలుపొందగా, విశావదర్‌లో ఆప్ అభ్యర్థి గోపాల్ విజయం సాధించారు. పంజాబ్ లూథియానా వెస్ట్‌లో ఆప్ అభ్యర్థి సంజీవ్ గెలుపొందారు. అంతే కాకుండా కేరళలోని నిలంబూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధన్ విజయం సాధించారు. బెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థి అలిఫా విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు నాలుగురు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రజలు, విశ్లేషకులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఈ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల మరణాలు, రాజీనామాల కారణంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి.
Next Story






