అమెరికాలో స్వర్ణ యుగం మొదలైంది.. ట్రంప్ తొలి ప్రసంగంలో కీలక పాయింట్లు ఇవే

by Ajay Maddhiboyina |

తాను ఎప్పటికీ అమెరికాకే ప్రాధాన్యత ఇచ్చేలా పాలిస్తానని అమెరికన్లకు మాట ఇచ్చారు. తన పాలనలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముందుగా న్యాయ శాఖ నుంచే ఈ మార్పులు ప్రారంభిస్తానని ట్రంప్ చెప్పారు.

అమెరికాలో స్వర్ణ యుగం మొదలైంది.. ట్రంప్ తొలి ప్రసంగంలో కీలక పాయింట్లు ఇవే
X

- ఇది మనకు విముక్తి దినం

- మెక్సికో సరిహద్దు వద్ద ఎమర్జెన్సీ అమలు చేస్తాం

- ప్రపంచం మనల్ని చూసి అసూయ పడుతుంది

- తొలి ప్రసంగంలో ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో:

అమెరికాలో స్వర్ణ యుగం మొదలైంది. 2025 జనవరి 20 విముక్తి దినంగా దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూఎస్ 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ తన తొలి సారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తన పాలనకు సంబంధించిన అజెండాను వివరించారు. అమెరికాకు స్వర్ణ యుగం ఇప్పుడే మొదలైంది. మనం మన పూర్వ వైభవాన్ని త్వరలోనే సొంతం చేసుకుంటామని, మిగిలిన ప్రపంచ దేశాలు మనల్ని చూసి ఆసూయపడతాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఎప్పటికీ అమెరికాకే ప్రాధాన్యత ఇచ్చేలా పాలిస్తానని అమెరికన్లకు మాట ఇచ్చారు. తన పాలనలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముందుగా న్యాయ శాఖ నుంచే ఈ మార్పులు ప్రారంభిస్తానని ట్రంప్ చెప్పారు.

ఎన్నికల ప్రచార సమయంలో దేవుడి దయవల్లే తాను కాల్పుల నుంచి బయట పడ్డాను. అమెరికా ప్రజలకు అత్యుత్తమ పాలన అందించేందుకు రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్యబద్దంగా పని చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. మెక్సితో ఉన్న సరిహద్దు ప్రాంతంలో అక్రమ వలసలు అరికట్టేందుకు, నేరగాళ్లు అమెరికాలోకి రాకుండా ఎమర్జెన్సీ విధిస్తామని ట్రంప్ చెప్పారు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. అమెరికన్ రెస్టారెంట్లలో తరుచుగా చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలు పునరావృతం కాకుండా అరికడతామని ట్రంప్ అన్నారు. దక్షిణాదిన ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని చెప్పారు. పనమా కెనాల్‌కు సంబంధించిన ఒప్పందాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అందుకే దానిని తిరిగి వెనక్కు తీసుకుంటామని ట్రంప్ చెప్పారు.

రాబోయే రోజుల్లో అమెరికా వ్యోమగాములను మార్స్ పంపిస్తాము. అనేక రంగాల్లో అమెరికాను తిరిగి అగ్రగామిగా నిలబెడతానని ట్రంప్ చెప్పారు. గత ఎనిమిది ఏళ్లలో తాను అత్యధికంగా టార్గెట్ చేయబడ్డాను. అమెరికా 250 ఏళ్ల చరిత్రలో ఏ అధ్యక్షుడిని కూడా ఇంతలా టార్గెట్ చేయలేదని ట్రంప్ ఆరోపించారు. మేము మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని, మన దేవుడిని ఎప్పటికీ మర్చిపోమని ట్రంప్ మాటిచ్చారు.

Next Story