రిపబ్లిక్‌ డే పరేడ్‌.. ఆ పక్షుల కోసం చికెన్‌! ఢిల్లీ ప్రభుత్వం చర్యలు

by Ramesh Naini |

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే ఎయిర్‌ షోలో విమానాలకు పక్షుల నుంచి ప్రమాదం తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

రిపబ్లిక్‌ డే పరేడ్‌.. ఆ పక్షుల కోసం చికెన్‌! ఢిల్లీ ప్రభుత్వం చర్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే ఎయిర్‌ షోలో విమానాలకు పక్షుల నుంచి ప్రమాదం తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గద్దల వంటి పక్షులు (బ్లాక్‌ కైట్స్‌) విమాన మార్గాల్లోకి రాకుండా ఉండేందుకు ఈ సారి 1,275 కిలోల బోన్‌లెస్‌ చికెన్‌ను వినియోగించనుంది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ముందస్తు చర్యల్లో గతంలో బఫెలో మాంసాన్ని ఉపయోగించేవారు. వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈసారి తొలిసారిగా చికెన్‌ మాంసాన్ని ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు.

జనవరి 15 నుంచి 26 వరకు నగరంలోని 20 ప్రాంతాల్లో, ముఖ్యంగా రెడ్‌ఫోర్ట్‌, జామా మసీదు పరిసరాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షులకు ఆహారం అందించడం ద్వారా అవి ఎయిర్‌ షో మార్గాల నుంచి దూరంగా ఉండేలా చేయడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రిపబ్లిక్‌ డే పరేడ్‌ వేడుకలు సురక్షితంగా, సాఫీగా సాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Next Story