- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు: బెంగాల్ అధికారులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి అధికారుల పేర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ఓటర్ల జాబితాలో తమ పేర్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ సుమారు 65 మంది ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, బాధితులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించాలని సూచించింది. కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈసారి వారు ఓటు వేయలేకపోవచ్చు, కానీ ఓటర్ల జాబితాలో పేరు ఉండేలా చూసుకోవడం అంతకంటే ‘విలువైన హక్కు’ (More Valuable Right).. ఆ హక్కును కాపాడతాం’అని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. ఈ వివాదాలను పరిష్కరించేందుకు ఇప్పటికే జ్యుడీషియల్ అధికారులతో కూడిన 19 అప్పీలేట్ ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయని, అక్కడే మీ వాదనలు వినిపించాలని పిటిషనర్లకు సూచించింది.
కాగా, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించారు. ఇందులో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సుమారు 65 మంది అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. తమ వద్ద అధికారిక డ్యూటీ ఆర్డర్లు, EPIC నంబర్లు ఉన్నప్పటికీ పేర్లు తొలగించడం ఏకపక్షమని వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.






