- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
POCSO CASE: సుప్రీం కోర్టులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో విచారణ కొనసాగించడానికి అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో విచారణ కొనసాగించడానికి అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు అన్ని ట్రయల్ కోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఓ మహిళ సాయం కోసం తాను యడ్యూరప్ప నివాసానికి వెళ్లగా తనతో పాటు తన 17ఏళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
డబ్బు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన తరవాత కొంత కాలానికి బాలిక తల్లి మరణించింది. తరవాత అనే విచారణల అనంతరం అదనపు సిటీ సివిల్ మరియు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కాగ్నిసెన్స్ ఆర్డర్ జారీ చేసి నిందితులను మార్చి 15న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. దీంతో ఆయన ప్రస్తుత పిటిషన్ న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. తనపై కేవలం రాజకీయలబ్ధి కోసం చేసిన ఆరోపణలేనని పేర్కొన్నారు.






