ఇరాన్‌ చమురు కొనుగోలు వార్తలు.. స్పందించిన రిలయన్స్‌

by Ramesh Naini |

అమెరికా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల చమురును రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసిందంటూ ‘రాయిటర్స్’ వార్త సంస్థ ప్రచురించిన కథనాలను ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది.

ఇరాన్‌ చమురు కొనుగోలు వార్తలు.. స్పందించిన రిలయన్స్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల చమురును రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసిందంటూ ‘రాయిటర్స్’ వార్త సంస్థ ప్రచురించిన కథనాలను ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తాము ఇరాన్ చమురును కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రిలయన్స్ స్పష్టం చేసింది. అవన్నీ పూర్తిగా నిరాధారమైన, తప్పుదోవ పట్టించే అవాస్తవ కథనాలని గురువారం ఒక ప్రకటనలో కొట్టిపారేసింది. ప్రచురణకు ముందే వాస్తవాలను నిర్ధారించుకోవాలని సంబంధిత మీడియా సంస్థలకు రిలయన్స్ ఈ సందర్భంగా సూచించింది.

Next Story