- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. NIA దర్యాప్తులో సంచలన నిజాలు
ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ (NIA) దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన ఘోర కారు బాంబు పేలుడు ఉదంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సంచలన విషయాలను వెల్లడించింది. ఈ కేసులో 10 మంది నిందితులపై ఎన్‌ఐఏ దాఖలు చేసిన 7,500 పేజీల భారీ ఛార్జ్‌షీట్ ఆధారంగా అధికారిక వర్గాలు కీలక కీలక వివరాలను మీడియాకు లీక్ అయ్యాయి. అయితే, ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన నిందితుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ గుర్తింపును (Fake Identity) ఉపయోగించి బాంబుల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించడమే కాకుండా, అల్ ఫలా ప్రైవేట్ విశ్వవిద్యాలయంలోనే తాత్కాలిక ల్యాబ్‌ను కూడా నడిపినట్లుగా విచారణలో తేలింది.
‘రాహుల్ భట్’ పేరుతో ఆన్‌లైన్ ఆర్డర్లు..
పేలుడు పదార్థాలతో కూడిన ఐ20 కారు నడుపుతూ స్పాట్‌లోనే మరణించిన ప్రధాన నిందితుడు, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ ఉమర్ అన్ నబీ (Umer Un Nabi), ఈ కుట్ర కోసం డిజిటల్ నెట్‌వర్క్‌ను వాడుకున్నాడు. ఈ-కామర్స్ సైట్ అయిన ‘ఇండియామార్ట్’ (IndiaMART)లో తన పేరును రాహుల్ భట్గా మార్చుకుని ఖాతా తెరిచాడు. ఈ నకిలీ ప్రొఫైల్ ద్వారా ఎరువుల బ్యాగులు, ఎసిటోన్ సాల్వెంట్, ఆనోడ్‌లు, బాంబుల తయారీకి వాడే వివిధ కెమికల్స్ కోసం డీల్స్ మాట్లాడినట్లుగా ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా బాంబుల్లో వాడే మిక్స్డ్ మెటల్ ఆక్సైడ్ (MMO) కోటెడ్ టైటానియం ఆనోడ్‌ను ముంబైకి చెందిన ఓ వ్యాపారికి రూ.25వేలు ఫోన్ పే చేసి కొరియర్ ద్వారా తెప్పించున్నాడు. ఎన్‌ఐఏ అధికారులు ఆ డెలివరీ చలాన్‌ను స్వాధీనం చేసుకుని సరఫరా గొలుసును బ్రేక్ చేశారు. ఇక ఈ హై-ఇంటెన్సిటీ ఐఈడీ (IED) వాహన పేలుడు వెనుక అల్-ఖైదా (AQIS), అన్సార్ గజ్వతుల్ హింద్ (AGUH) ఉగ్రవాద ముఠాల హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏ నిర్ధారించింది. నిందితుల మొబైల్ పరికరాల నుంచి జిహాదీ సాహిత్యం, బాంబుల తయారీకి సంబంధించిన డిజిటల్ ఆధారాలను రికవరీ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు వెల్లడించారు.






