- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీకి రెడ్ అలర్ట్... 150 విమానాలు రద్దు
తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దేశ రాజధాని నగరం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దేశ రాజధాని నగరం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో 100 మీటర్ల దూరం కూడా కనిపించనంతగా దట్టమైన పొగమంచు అలుముకుంది. రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. దీంతో ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన 150కి పైగా విమానాలు రద్దయ్యాయి, మరో 200 విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి.
అలాగే ఉత్తర భారత్ లోని పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను కూడా పొగమంచు కమ్మేసిందని IMD పేర్కొంది. శుక్రవారం తెల్లవారుజామున ఆగ్రా, బరేలీ, అమృత్‌సర్, అంబాలా, సఫ్దర్‌జంగ్ వంటి ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ.. ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి.






