- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Stampede : తొక్కిసలాటకు కారణం RCB : ట్రిబ్యునల్
ఇటీవల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట)Bengaluru Stampede) ఘటనకు RCB నే కారణమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT) పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట)Bengaluru Stampede) ఘటనకు RCB నే కారణమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT) పేర్కొంది. లక్షల సంఖ్యలో అభిమానులు గుమి గుదాటానికి ఆర్సీబినే కారణం అని, అందువల్లే తొక్కిసలాట జరిగి ఉంటుందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విక్టరీ పరేడ్ పై ప్రకటన చేయడం వల్లే భారీగా అభిమానులు తరలి వచ్చారని తెలిపింది. అంత తక్కువ సమయంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఎలా చేయగలరని ప్రశ్నించింది. ఈ ఘటనలో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ ఆఫీసర్ వికాస్ కుమార్.. సస్పెన్షన్ ను కొట్టివేయాలని క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్.. పోలీసులేమీ దేవుళ్ళు కాదని, మనుషులేనని, వారి దగ్గర మంత్రదండాలు ఏమీ ఉండవని మండిపడింది.
భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందుగా ఊహించే అనుమతులు మంజూరు చేయలేదని, అనంతరం జరిగిన పరిణామాలకు కేవలం పోలీసులనే బాధ్యులు చేయడం సరికాదని, సస్పెన్షన్ ను కొట్టివేసింది ట్రిబ్యునల్. కాగా ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకున్న అనంతరం RCB బెంగుళూరులో విక్టరీ పరేడ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించగా.. లక్షల సంఖ్యలో వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి రావడానికి ప్రయత్నించడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.






