Benguluru Stampede : బెంగుళూరు తొక్కిసలాట.. ఆర్థిక సాయం ప్రకటించిన RCB

by Muthe.Rajitha |

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద నిన్న జరిగిన దుర్ఘటన గురించి తెలిసిందే.

Benguluru Stampede : బెంగుళూరు తొక్కిసలాట.. ఆర్థిక సాయం ప్రకటించిన RCB
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద నిన్న జరిగిన దుర్ఘటన గురించి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై RCB బృందం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే, గాయపడిన వారి సహాయార్థం ‘ఆర్సీబీ కేర్స్’ పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ఈ ఘటన బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం గేట్ వద్ద 2-3 లక్షల మంది RCB అభిమానులు గుమిగూడడం, ఇరుకైన గేట్లు, సరైన సమాచారం, ఏర్పాట్లు లేకపోవడంతో జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddha Ramaiah) ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. అలాగే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం(KSCA) మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అదనపు సాయం అందజేయనున్నట్టు పేర్కొంది.

Next Story