- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: ఈఎంఐ ఎగ్గొడితే ఫోన్ లాక్.. మళ్లీ ఆ నిబంధన అమలు చేయబోతున్న ఆర్బీఐ!
రుణఎగవేతలను తగ్గించే దిశలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: క్రెడిట్ తో మొబైల్ కొనుగోలు చేసే వారికి ఆర్బీఐ (RBI) షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. లోన్ పై మొబైల్ కొనుగోలు చేసి ఆ డబ్బును చెల్లించని పక్షంలో మొబైల్ ను లాక్ (Remote Phone Locking) చేసేందుకు విక్రేతలకు అనుమతి ఇచ్చే యోచనలో ఆర్బీఐ ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మొండి బకాయిలను తగ్గించే చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోబోతున్నదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రుణాలు డీఫాల్ట్ చేసిన వారి ఫోన్లను లాక్ చేసే విధానం గతేడాది వరకు అమలులో ఉండేది. రుణం జారీ చేసే సమయంలో మొబైల్ లో ఇన్ స్టాల్ చేసిన ఒక యాప్ సహాయంతో రుణాలు చెల్లించకుంటే ఫోన్ పని చేయకుండా లాక్ చేసే వారు. అయితే గతేడాది ఆర్బీఐ ఇలా ఫోన్లను లాక్ చేయడం ఆపాలని రుణదాతలను ఆదేశించింది. అయితే రణఎగవేతలు పెరిగిపోతున్నందునా ఈ మొండి బకాయిలను తగ్గించేందుకు వీలుగా త్వరలోనే ఫోన్ లాక్ మెకానిజంపై ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రుణదాతలతో చర్చల అనంతరం ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది.
వ్యక్తిగత గోప్యతపై ఆందోళనలు:
ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల హక్కులు, గోప్యత సంగతి ఏంటి అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆయితే ఫోన్ లాక్ మెకానిజం ఇన్ స్టాల్ చేసే ముందు రుణగ్రహీతల సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాలని ఒక వేళ ఫోన్ లాక్ చేసినా ఆ ఫోన్ లోని వ్యక్తిగత డేటాను రుణదాతలు ఎట్టిపరిస్థితుల్లో యాక్సెస్ చేయకుండా నిషేధం విధించబోతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ 2024లో చేసిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని మూడో వంతుకుపైగా వినియోగదారుల మొబైల్ ఫోన్ లు సహా ఎలక్ట్రానిక్స్ వస్తువులను చిన్న మొత్తాల రుణాలపైనే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. 1.4 బిలియన్ జనాభా ఉన్న మన దేశంలో 1.16 బిలియన్ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని టెలికాం రెగ్యులేటర్ పేర్కొంది.






