జన్ ధన్ ఖాతాదారులకు ఆర్బీఐ ముఖ్య గమనిక.. రెండు నెలలే గడువు

by Naga Rani Yarlagadda |

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది.

జన్ ధన్ ఖాతాదారులకు ఆర్బీఐ ముఖ్య గమనిక.. రెండు నెలలే గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోగా తమ ఖాతాలకు రీ-కేవైసీని పూర్తి చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ పథకం ప్రారంభమైన పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. జులై 1న ప్రారంభమైన రీ-కేవైసీ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకూ కొనసాగనుంది.

యాంటీ మనీ లాండరింగ్ ప్రొటోకాల్స్ లో భాగంగా ఏటా కస్టమర్ల వివరాలను నిర్థారించుకోవడం తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఈ ఏడాది పెద్దసంఖ్యలో జన్ ధన్ ఖాతాలకు కేవైసీ అప్డేషన్ గడువు ముగియనుండగా.. రీ కేవైసీ పూర్తిచేయని ఖాతాలపై ట్రాన్సాక్షన్ల పరిమితులు విధించడం లేదా టెంపరరీగా సస్పెండ్ చేయవచ్చని తెలిపారు. కాగా.. 2014లో ప్రారంభమైన జన్ ధన్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకూ 55 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

Next Story