భారత్, బ్రిటన్‌ల మధ్య ట్రేడ్ డీల్.. స్వాగతించిన ఆర్బీఐ గవర్నర్

by Naga Rani Yarlagadda |

భారత్, బ్రిటన్ ల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ను రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) స్వాగతించారు.

భారత్, బ్రిటన్‌ల మధ్య ట్రేడ్ డీల్.. స్వాగతించిన ఆర్బీఐ గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బ్రిటన్ ల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ను రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) స్వాగతించారు. రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం అనేక రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. BFSI సమ్మిట్ కు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూకేతో జరిగిన ట్రేడ్ డీల్ (Trade Deal) మాదిరిగానే అమెరికా సహా ఇతర దేశాలతోనూ ఒప్పందాలు చేసుకునేందుకు చర్చలు చేస్తోందన్నారు. అలాగే అమెరికా ఆర్థిక అభివృద్ధికి అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తీసుకుంటోన్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. కానీ.. పావెల్ నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ న సందర్శించగా.. ఇరుదేశాల ప్రధానుల సమక్షంలో ట్రేడ్ డీల్ జరిగింది. ఈ ఒప్పందంపై ఇరుదేశాల మంత్రులు సంతకాలు చేయగా.. బ్రిటన్ కు భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో 99 శాతం ఉత్పత్తులపై పన్ను భారం తగ్గనుంది. భారత్ లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్, విస్కీ, జిన్ లపై పన్నుభారం సగానికి తగ్గనుంది.

Next Story