- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్ మంత్రిగా భార్య ప్రమాణస్వీకారం.. రవీంద్ర జడేజా ఏమన్నారంటే?
by Gantepaka Srikanth |
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సతీమణి రివాబా జడేజా శుక్రవారం గుజరాత్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సతీమణి రివాబా జడేజా శుక్రవారం గుజరాత్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రవీంద్ర జడేజా స్పందించారు. ‘‘నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. పెరిగిన బాధ్యతతో మరింత ప్రజలకు ఉపయోగపడావని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. జైహింద్’’ అని జడేజా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా, గుజరాత్‌లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూతన కేబినెట్ ఏర్పాటు అయింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో 26 మంది సభ్యుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు.
Next Story






