Rats Hospital: వామ్మో.. దవాఖానలో ఎలుకల స్వైరవిహారం.. పేషెంట్ తల వద్ద కుప్పలు కుప్పలు..

by Ramesh Naini |

దేశంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత సరైన నిర్వహణ లేకపోవడం తరచుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.

Rats Hospital: వామ్మో.. దవాఖానలో ఎలుకల స్వైరవిహారం.. పేషెంట్ తల వద్ద కుప్పలు కుప్పలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత సరైన నిర్వహణ లేకపోవడం తరచుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లాలో (Madhya Pradesh hospital) షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లాలోని పిల్లల వార్డులో పేషెంట్ బెడ్ వద్ద ఎలుకలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. మరోవైపు వార్డులో మొత్తం స్వైర విహారం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో రాష్ట్రంలోని ఆస్పత్రుల పరిస్థితులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కాగా, ఈ ఎలుకల స్వైరవిహారం ఘటనపై మధ్యప్రదేశ్ ప్రజారోగ్య శాఖ సీరియస్ అయింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆస్పత్రిని సందర్శించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని మందలించి, సౌకర్యాలను వెంటనే మెరుగుపరచాలని ఆదేశించారు.

Next Story