- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోబోటిక్ సాంకేతికతతో.. అరుదైన మూత్రాశయ కణితి తొలగింపు
బ్లాడర్లో ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఓ పేషంట్ కు వైద్యులు..

దిశ, వెబ్‌డెస్క్: బ్లాడర్లో ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఓ పేషంట్ కు వైద్యులు అరుదైన సర్జరీ చేశారు. రోబోటిక్ మెషీన్ ను ఉపయోగించి మూత్రాశయంలో ఏర్పడిన ట్యూమర్ ను తొలగించారు. ఉత్తరప్రదేశ్ లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) వైద్యులు ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే ఈ తరహా సర్జరీ మొదటిసారి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. 60 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆస్పత్రికి వెళ్లినపుడు మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి కళ్లు తిరగడం, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, హైబీపీ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత.. అతని బ్లాడర్లో కణితి ఉన్నట్లు తేలింది. దాని ద్వారా విడుదలవుతున్న హార్మోన్లే.. అతని అనారోగ్య సమస్యలకు కారణంగా నిర్థారించారు.
ఆ కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాలి. ఇలాంటి సర్జరీలకు లాప్రోస్కోపీ, సంప్రదాయ పద్ధతుల్లో చేస్తారు. కానీ అలా చేస్తే.. మూత్ర నాళానికి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండటంతో రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. యూరాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన స్పెషల్ డాక్టర్స్ టీమ్ ఈ సర్జరీని సక్సెస్ ఫుల్ గా చేసింది. ఈ సర్జరీతో తమ ఆస్పత్రి పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా మరింత పెరిగాయని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.






