- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య.. ఒక్కసారిగా దిగొచ్చిన క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరే సూచనలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు ఫలించి.. ఓ చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ఇవాళ భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై దాడులను చివరి నిమిషంలో నిలిపివేసి, శాంతి చర్చలకు మొగ్గు చూపడం ప్రపంచ ఇంధన మార్కెట్‌కు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 5 శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి. అదేవిధంగా అమెరికాకు చెందిన డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ధరలు కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 89 డాలర్లకు దిగి వచ్చింది. గత కొన్ని రోజులుగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత భయాలతో గాల్లోకి లేచిన చమురు ధరలు, తాజా ఉద్రిక్తతల సడలింపుతో మళ్లీ అదుపులోకి వచ్చాయి. ఇరాన్ నుంచి చమురు సరఫరా పునరుద్ధరించబడితే ప్రపంచ మార్కెట్‌లో కొరత తీరుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.






