- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం.. 53 ఏళ్ల వయసులో శిక్ష.. ఇంతకీ ఏంటంటే?
1988లో రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: 1988లో రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత, దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు (Supreme Court) ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది. నేరం జరిగినప్పుడు నిందితుడి వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని తేలడంతో, సుప్రీం కోర్టు ఈ కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు (Juvenile Justice Board) అప్పగించాలని తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్లితే..
రాజస్థాన్‌కు చెందిన ఓ మైనర్ 1988లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడి వయసు 53 ఏళ్లు. ఇక గతంలో దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు అతడికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. రాజస్థాన్ హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. అయితే, నిందితుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. నిందితుడు తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నేరం చేసిన సమయంలో అతడు మైనర్ అని ధర్మాసనానికి తెలిపారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ట్రయల్ కోర్టు విధించిన, హైకోర్టు సమర్థించిన శిక్షను కొట్టివేసింది. అతడిని జువైనల్ బోర్డుకు అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం, మైనర్‌గా ఉన్నప్పుడు నేరానికి పాల్పడిన వ్యక్తిని పెద్దల కోర్టులో కాకుండా, జువైనల్ జస్టిస్ బోర్డు ద్వారానే విచారించాలి.
అయితే, నేరం రుజువు కావటంతో జువెనైల్ న్యాయ చట్టాల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కోర్టు సూచనల మేరకు అతను సెప్టెంబర్ 15న జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుకావాల్సి ఉంది. అక్కడ బోర్డు అతడిని గరిష్ఠంగా మూడు సంవత్సరాలపాటు ప్రత్యేక నివాస గృహంలో (special home) ఉంచే అవకాశముంది.






