- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ranya Rao: చిక్కుల్లో కన్నడ నటి రన్యారావు
గోల్డ్ స్మగ్లింగ్ లో అరెస్టయిన కన్నడనటి రన్యారావు చిక్కుల్లో పడ్డారు. మరో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితి లేదు. ఆమెపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా ఏడాది పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: గోల్డ్ స్మగ్లింగ్ లో అరెస్టయిన కన్నడనటి రన్యారావు చిక్కుల్లో పడ్డారు. మరో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితి లేదు. ఆమెపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా ఏడాది పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్యా రావుపై అక్రమ రవాణా నిరోధక చట్టం కింద అధికారులు అభియోగాలు మోపారు. దీంతో ఒక సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. రన్యారావుపై కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ , 1947 (COFEPOSA) కింద కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. కోఫెపోసా చట్టం కారణంగా ఒక సంవత్సరం పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని తెలుస్తోంది. రన్యరావుతో పాటు నిందితులు తరుణ్ రాజు, సాహిల్ సకారియా జైన్‌లపై కోఫెపోసా చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. నిందితులెవరికీ ఏడాది పాటు బెయిల్ లభించదు. ఈ ముగ్గురూ ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. కాగా.. ఈ కేసును డీఆర్‌ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నాయి.
గోల్డ్ స్మగ్లింగ్
మార్చి 3న బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడింది. ఆమె దగ్గర నుంచి 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 12.56 కోట్లకు పైగా ఉంటుంది. ఆ తర్వాత, ఆమె ఇంట్లో తనిఖీ చేయగా.. రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె స్నేహితుడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరూ కలిసి స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈకేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.






