- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allahabadia: రణవీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.

దిశ, నేషనల్ బ్యూరో: తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. పాస్‌పోర్టును అతనికి ఇచ్చేయాలని కోర్టు అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అతనిపై నమోదు అయిన కేసుల్లో విచారణ పూర్తి అయిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణం నేపథ్యంలో అతనికి పాస్‌పోర్టును అప్పగించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేవ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అసోం, మహారాష్ట్ర ప్రభుత్వాలు విచారణ పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు కోసం మహారాష్ట్ర సైబర్ క్రైం బ్యూరోకు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. అల్హాబాదియా తరఫున సీనియర్ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. అల్హాబాదియాపై నమోదైన కేసులన్నీ ఒక్కచోటకు చేర్చాలన్న అడ్వకేట్ అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు కోర్టు చెప్పింది.
ఇండియాస్ గాట్ లాటెంట్ షో..
‘ఇండియాస్ గాట్ లాటెంట్’(IGL) కార్యక్రమంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అల్హాబాదిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులో ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అతడ్ని అరెస్టు చేయవద్దని పేర్కొంది. థానే పోలీసు స్టేషన్‌లో పాస్‌పోర్టును డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే విలువలు, హుందాతనంతో ద రణ్‌వీర్ షోను నడుపుకోవచ్చు అని మార్చి 3వ తేదీన సుప్రీంకోర్టు అల్హాబాదియాకు తెలిపింది. ఇప్పుడు పాస్ పోస్టు ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.






