విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రామ్మోహన్‌నాయుడు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-12 13:57:33  IST  )

అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాద స్థలి(Plane Crash Site)ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) పరిశీలించారు.

విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రామ్మోహన్‌నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాద స్థలి(Plane Crash Site)ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. చాలా విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. కాగా, ఈ విమాన ప్రమాదంలో 242 మంది మృతిచెందినట్లు స్థానిక అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్(Ahmedabad Police Commissioner) తెలిపారు. మరోవైపు విమానం బీజే మెడికల్‌ కాలేజీపై కూలడంతో ఆ సమయంలో కాలేజీలో ఉన్న 20 మంది మెడికోలు కూడా మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది సిబ్బంది, 242మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు ఉన్నారు. అంతేకాదు.. ఇద్దరు శిశువులు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతిచెందారు.

Next Story