Plane Crash : బ్లాక్ బాక్స్ విచారణపై రామ్మోహన్ నాయుడు క్లారిటీ

by Muthe.Rajitha |

అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమానం (AI-171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్) ప్రమాదం(Air India Plane Crash)లోని బ్లాక్ బాక్స్ (Block Boxes)పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు.

Plane Crash : బ్లాక్ బాక్స్ విచారణపై రామ్మోహన్ నాయుడు క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమానం (AI-171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్) ప్రమాదం(Air India Plane Crash)లోని బ్లాక్ బాక్స్ (Block Boxes)పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని భారతదేశంలోనే ఉందని స్పష్టం చేశారు. దానిని విదేశాలకు తరలించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. జూన్ 12న ఈ విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన కొద్ది సెకన్లలో కూలిపోయి 279 మంది మృతి చెందారు.

ఘటనా స్థలం నుంచి జూన్ 13, 16 తేదీల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు (డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్) ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) స్వాధీనం చేసుకుంది. ఢిల్లీలోని అత్యాధునిక AAIB ల్యాబ్‌లో బ్లాక్ బాక్స్ ల డేటా విశ్లేషణ జరుగుతోందని, విదేశాలకు పంపాల్సిన అవసరం లేదని రామ్మోహన్ నాయుడుపేర్కొన్నారు. AAIB.. NTSB, బ్రిటన్ CAA, బోయింగ్ నిపుణులతో కలిసి ప్రమాదంపై విచారణ చేస్తోంది.

25 గంటల ఫ్లైట్ డేటా, 2 గంటల ఆడియో ద్వారా ఇంజన్ వైఫల్యం, పైలట్ ఎర్రర్, బర్డ్ స్ట్రైక్ వంటి కారణాలను గుర్తించనున్నారు. ICAO నిబంధనల ప్రకారం 30 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 12 నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాల్సి ఉంది.

Next Story