Ram temple chief priest: అయోధ్య రామమందిర ప్రధాన పూజారి జలసమాధి

by Shamantha N |

అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్(Acharya Satyendra Das)ని జలసమాధి చేశారు. సరయూ నదిలో ఆయన పార్థివదేహాన్ని జలసమాధి చేశారు.

Ram temple chief priest: అయోధ్య రామమందిర ప్రధాన పూజారి జలసమాధి
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్(Acharya Satyendra Das)ని జలసమాధి చేశారు. సరయూ నదిలో ఆయన పార్థివదేహాన్ని జలసమాధి చేశారు. కాగా.. . ఫిబ్రవరి 3న బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో 85 ఏళ్ల దాస్‌ను ల‌క్నోలోని సంజయ్‌ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎస్‌జీపీజీ)లో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత గోపాల్ ఆశ్రయమంలో పార్థివదేహాన్ని ఉంచారు. సత్యేంద్ర దాస్ అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భఆరీగా పాల్గొన్నారు. తన 20వ ఏట సన్యాస దీక్ష తీసుకున్న సత్యేంద్ర దాస్‌ 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామ జన్మభూమి ఆలయ పూజారిగా ఉన్నారు.

అంతిమ యాత్రలో బాబ్రీ మసీదు మాజీ అడ్వొకేట్

ఆచార్య స‌త్యేంద్ర దాస్ అంతిమ యాత్రలో బాబ్రీ మ‌సీదు లిటిగెంట్, మాజీ అడ్వ‌కేట్ ఇక్బాల్ అన్సారీ పాల్గొన్నారు. ఆచార్య పార్దీవ‌దేహాన్ని తీసుకెళ్లిన వాహ‌నాన్ని ఆయ‌న లాగారు. దాస్ ప‌ట్ల ఉన్న అభిమానం, గౌర‌వాన్ని ఆయ‌న చూపించారు. చాన్నాళ్లుగా క‌లిసి ఉన్నామ‌ని, ఎప్పుడూ ఐక్య‌త, సామ‌రస్యం గురించి మాట్లాడుకున్నామ‌ని అన్సారీ చెప్పారు. ఐకమత్యంతో క‌లిసి జీవించ‌డంలో ఉన్న ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నామ‌న్నారు. కానీ, ఇప్పుడు త‌న స‌హ‌చ‌రుడిని కోల్పోవడం బాధగా ఉందని అన్సారీ అన్నారు.

Next Story